తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్..!

- July 28, 2024 , by Maagulf
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్..!

హైదరాబాద్: దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. ఈ సారి ఎన్నికల బరిలో భరత్ భూషణ్‌తో పాటు, ఠాగూర్ మధు పోటీ చేశారు. కాగా ఫిల్మ్ ఛాంజర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ గెలిచాడు.భరత్ భూషణ్‌ను డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి సభ్యులు ఎన్నుకున్నారు.

ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్ , వైవీఎస్ చౌదరి పోటీ చేశారు. నిర్మాతల నుంచి ఉపాధ్యక్షుడి ఎన్నికల జరుగుతున్నాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకుంటారు. ప్రొడ్యూసర్స్ , ఎగ్జిబిటర్స్ , డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్‌లోని సభ్యులు ఓట్లు వేశారు. ఇక గత ఐదేళ్ల పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కి అధ్యక్షుడిగా దిల్ రాజు ఉండగా.. ఈసారి ఇద్దరు నిర్మాతలు పోటీలో నిల్చున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com