యూఏఈలో మొదటి అధికారిక లాటరీ లైసెన్స్ జారీ..!
- July 28, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లో మొదటి అధీకృత లాటరీని నిర్వహించడానికి లైసెన్స్‌ను యూఏఈ గేమింగ్ అథారిటీ మంజూరు చేసింది. వాణిజ్య గేమింగ్ ఆపరేటర్ అయిన గేమ్ LLCకి లాటరీ లైసెన్స్ మంజూరు చేశారు. జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) ఈ మేరకు ప్రకటించింది. ఇది వాణిజ్య గేమింగ్ రంగానికి కొత్త మైలురాయిగా నిలుస్తుందన్నారు.
GCGRA ఛైర్మన్ జిమ్ ముర్రెన్ మాట్లాడుతూ.. యూఏఈలో లాటరీ వాతావరణాన్ని సురక్షితంగా మార్చుతుందన్నారు. అదే సమయంలో సురక్షితమైన వాణిజ్యాన్ని పెంపొందించడంలో తమ నిబద్ధతను కొనసాగిస్తామని తెలిపారు.
GCGRA నుండి అనుమతి లేకుండా యూఏఈలో వాణిజ్య గేమింగ్ కార్యకలాపాలలో పాల్గొనడం, నిర్వహించడం చట్టవిరుద్ధం. ఉల్లంఘనకు పాల్పడిన వారికి భారీ జరిమానాలు విధిస్తారు. అదే విధంగా లైసెన్స్ లేని ఆపరేటర్ల ద్వారా పాల్గొనడం కూడా చట్టవిరుద్ధం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







