దుబాయ్ మాల్ అక్వేరియంలో బేబీ షార్క్ అరుదైన జననం..

- July 30, 2024 , by Maagulf
దుబాయ్ మాల్ అక్వేరియంలో బేబీ షార్క్ అరుదైన జననం..

దుబాయ్: దుబాయ్‌ మాల్‌లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అక్వేరియంలో షార్క్ బేబీ పుట్టింది. షార్క్ బేబీకి జన్మనిస్తున్న సమయంలో మాల్‌కు వచ్చిన సందర్శకులు ఆ అద్భుతమైన క్షణాన్ని వీక్షించారు. ముఖ్యంగా, ఎమ్మార్ ద్వారా దుబాయ్ అక్వేరియం ప్రపంచంలోని అతిపెద్ద అక్వేరియంలలో ఒకటి.

నీటి అడుగున జంతుప్రదర్శనశాలలో ఈ అక్వేరియాన్ని నిర్మించారు. దీనికి సంబంధించి వీడియోను అక్వేరియం నిర్వాహకులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అక్వేరియంలోని సొరచేప తల్లి నుంచి బేబీ షార్క్ ఉద్భవించి నీటి ఉపరితలం మీదుగా జారిపోయే క్షణాన్ని వీడియోలో చూడవచ్చు. ”ఈ ఉదయం మా అక్వేరియంలో షార్క్‌ బేబీ ప్రాణం పోసుకోవడం చాలా అద్భుతంగా అనిపించిందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడా ఈ వీడియో వైరల్ అవుతోంది.

వీడియోను చూసిన వినియోగదారులు అద్భుతమైన క్షణం అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘నిన్న అక్కడే ఉన్నాం. డైవింగ్ చేసాం.. షార్క్ బేబీ పుట్టడం చాలా అద్భుతం’ మరో యూజర్ వ్యాఖ్యానించారు. ఆ బేబీ షార్క్ తినడం నేర్చుకునే వరకు ఒంటరిగా చెరువుకు తరలించాలని యూజర్ పోస్టు చేశాడు. దుబాయ్ మాల్‌లో అక్వేరియం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

అండర్ వాటర్ జూ ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ట్యాంక్‌లలో ఇదొకటి. జంతుప్రదర్శనశాల వెబ్‌సైట్ ప్రకారం.. 140 కన్నా ఎక్కువ జాతులను కలిగి ఉన్న వేలాది జలచరాలకు నిలయంగా ఉంది. ‘మా పది మిలియన్-లీటర్ల ట్యాంక్‌లో సాండ్ టైగర్ షార్క్‌లు, జెయింట్ గ్రూపర్స్, ఇతర సముద్ర జాతులతో సహా 400కి పైగా సొరచేపలు నివసిస్తున్నాయని వెబ్‌సైట్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com