సౌదీలో 100% విదేశీ యాజమాన్యానికి అనుమతి..!
- August 01, 2024
సౌదీ: అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా అనేక వ్యాపార రంగాలలో 100% విదేశీ యాజమాన్యాన్ని అనుమతిస్తుందని సౌదీ వాణిజ్య ఉప మంత్రి మరియు నేషనల్ కాంపిటీటివ్నెస్ సెంటర్ (NCC) CEO డా. ఎమాన్ అల్-ముతైరి తెలిపారు. సౌదీ అరేబియా విజన్ 2030 గణనీయమైన ఆర్థిక వైవిధ్యానికి, స్థిరమైన మరియు సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి మరియు వివిధ వ్యాపార రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు వాణిజ్య మంత్రి డాక్టర్ మజిద్ అల్-కసాబీ సౌదీ-కొరియన్ బిజినెస్ ఫోరమ్ సందర్భంగా చెప్పారు. కొరియాలోని సౌదీ రాయబారి సమీ అల్-సాధన్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు చెందిన సుమారు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 2019 నుండి 2023 వరకు రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం $35 బిలియన్లకు చేరుకుందని పేర్కొంటూ, ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడానికి సహకార ప్రయత్నాలను అల్-కసాబీ హైలైట్ చేశారు. గత ఏప్రిల్ వరకు కొరియన్ కంపెనీలకు 174 వాణిజ్య రికార్డులు జారీ చేయబడ్డాయని వెల్లడించారు. 2016 నుండి 60 ప్రభుత్వ సంస్థల ద్వారా తొమ్మిది కీలక రంగాలలో 820 ఆర్థిక సంస్కరణలు అమలు చేయబడ్డాయి, 1,200 చట్టాలు, నిబంధనలు జారీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







