యూఏఈ ఫుడ్ ATM.. రోజుకు 60వేల మందికి పైగా ప్రయోజనం..!

- August 03, 2024 , by Maagulf
యూఏఈ ఫుడ్ ATM.. రోజుకు 60వేల మందికి పైగా ప్రయోజనం..!

యూఏఈ: యూఏఈలో ఆమె ఉద్యోగులు అవిశ్రాంతంగా ప్రజల కడుపు నింపి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మొత్తం ఐదు కిచెన్స్ ద్వారా ప్రతిరోజూ 60వేల మందికి ఆహారం అందిస్తుంది. అయితే ఫుడ్ ఏటీఎం వ్యవస్థాపకురాలు అయేషా ఖాన్ మాత్రం తాను ఫుడ్ బిజినెస్‌ చేయడం లేదని, పేదలకు కడుపునిండా ఫుడ్ అందజేయడం తనకు తృప్తినిస్తుందని తెలిపారు.  2019లో స్థాపించబడిన ఫుడ్ ATM ద్వారా  తక్కువ-ఆదాయ కార్మికులకు 50 ఫిల్స్ నుండి Dh3 వరకు పూర్తి స్థాయి భోజనాన్ని విక్రయించే ఒక స్వచ్ఛంద కార్యక్రమం. అదే సమయంలో ఆర్థిక స్థోమత లేకుంటే ఆహారం ఉచితంగా అందజేస్తారు.  

 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కు చెందిన అయేషా తన 17 సంవత్సరాల వయస్సులో తండ్రి మరణించారు. ఆమె ట్యూషన్లు మరియు కోచింగ్ తరగతులు చెప్పి చదువును కొనసాగించింది.  గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె BSNLలో చేరారు. అనంతర కాలంలో BSNL కోసం IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను నిర్వహించడం ద్వారా ఆమె కెరీర్ లో ముందుకుపోయింది. 

2006లో దుబాయ్‌కి వచ్చిన ఆమె ‘డు’లో టెలికాం ఇంజనీర్‌గా చేరింది. IT కార్యకలాపాల కోసం కంపెనీ ఎంపిక చేసిన 60 మంది నిపుణులలో ఆమె ఒకరు. “ఆ సమయంలోనే నేను స్ట్రెస్ బస్టర్‌గా వంట చేయడం ప్రారంభించాను. నేను నా ఆహారాన్ని సహోద్యోగులతో షేర్ చేసుకునేదాన్ని. అది వారికి పెద్దగా నచ్చలేదు. కానీ తక్కువ వేతన కార్మికులు నేను వారికి ఇచ్చిన ఆహారాన్ని తిని మనస్ఫూర్తిగా అభినందించారు. వారు ఆహారం కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును ఆదా చేసినందుకు వారు కృతజ్ఞతతో ఉన్నారని గ్రహించాను. అప్పుడే అందరికీ అందుబాటులో ఉండేలా సరసమైన ధరకు భోజనం అందజేయడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను.’’ అని ఆమె వివరించారు. 2019లో ఆమె అజ్మాన్‌లో మొదటి ఫుడ్ ATMని ప్రారంభించారు. 2021లో ఆమె చేసిన కృషికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుండి అత్యధిక సంఖ్యలో కమ్యూనిటీ భోజనం అందించినందుకు ఆమె గుర్తింపు పొందింది. ఎనిమిది గంటలలోపు 50,744 మందికి భోజనాలు అందజేసింది.  దాదాపు 3వేల కంపెనీలతో ఒప్పందాలు ఉన్నాయి. అందులో పనిచేసే కార్మికులకు భోజనాలు అందజేసేందుకు ఫుడ్ కార్డులను అందజేస్తారు. ఒక కార్మికుడిని స్పాన్సర్ చేసే వ్యక్తులు లేదా కంపెనీలు భోజనానికి ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది.  కాంట్రాక్టులో లేని కార్మికులు కేవలం నగదు చెల్లించి అదే తక్కువ ధరకు నేరుగా భోజనాన్ని కొనుగోలు చేయవచ్చు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com