లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వయనాడ్ సహాయక చర్యల్లో మోహన్‌లాల్..
- August 03, 2024
కేరళ: కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఎంతో మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్ ముందుకు వచ్చారు. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ కూడా అయిన మోహన్‌లాల్ శనివారం ఆర్మీ యూనిఫాం ధరించి వయనాడ్‌కు చేరుకున్నారు.
మెప్పాడిలోని ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకున్న నటుడు, అధికారులతో కొద్దిసేపు చర్చించి.. కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆస్పత్రిలోచికిత్స పొందుతున్న బాధితులను మోహన్ లాల్ పరామర్శించనున్నారు. ఇప్పటికే ఆయన కేరళ సీఎం సహాయనిధికి రూ.25లక్షలు విరాళంగా అందించారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాలంటీర్లు, పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు, ప్రభుత్వ అధికారుల కృషిని ఆయన ప్రశంసించారు.
మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వందలాది మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి