క్యామియో రోల్ ట్రెండ్‌ని సెట్ చేయనున్న విక్టరీ హీరో
- June 16, 2016
ఒకప్పుడు టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న వెంకటేష్ ప్రస్తుతం సెలక్టెడ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో బాబు బంగారం అనే చిత్రం చేస్తున్న వెంకటేష్, అతిధి పాత్రలలోను మెరిసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే తన మేనల్లుడు నాగ చైతన్య తాజా చిత్రం ప్రేమమ్‌లో కీలకమైన మేనమామ రోల్‌ని పోషించాడు వెంకీ. ఆ సీన్ రష్ చూసిన వారందరు ఔట్‌పుట్ అదుర్స్ అని అంటున్నారట. ఇక బోయపాటి శ్రీను డైరెక్షన్‌లోను క్యామియో రోల్ చేసేందుకు వెంకటేష్ సిద్దంగా ఉన్నాడని సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రంలోని ఓ సాంగ్‌లో వెంకీ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తాడట. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.
మొత్తానికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ద్వారా మల్టీ స్టారర్ ట్రెండ్‌కి ఊపు తెచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ క్యామియో రోల్ ట్రెండ్‌ని కూడా వైరస్‌లా స్ప్రెడ్ చేస్తాడని అంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







