కన్వర్ యాత్రలో విషాదం..9 మంది భక్తులు మృతి
- August 05, 2024
పాట్నా: బీహార్‌లోని హాజీపూర్‌లో కావడి యాత్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఆదివారం అర్ధరాత్రి హాజీపూర్ సమీపంలోని సుల్తాన్‌పూర్ వద్ద కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్ వైర్ తగిలడంతో తొమ్మిది మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో ఒక మైనర్ ఉన్నారు. కావడి యాత్రికులు పహెల్జా నుంచి గంగాజలాన్ని తీసుకుని సోన్‌పూర్‌లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కన్వరియాలు ట్రాలీలో డీజేని తీసుకెళ్తున్నారని, దానికి 11 వేల వోల్టుల విద్యుత్ తీగ తగిలిందని స్థానిక ఎస్డీపీవో ఓంప్రకాశ్ తెలిపారు. దీంతో వారు విద్యుదాఘాతానికి గురయ్యారని చెప్పారు. ఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మరణించారని, మరొకరు దవాఖానలో చనిపోయారని వెల్లడించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి