‘జాతి రత్నాలు’ హీరో నవీన్ పోలిశెట్టికి ఏమైంది.?
- August 05, 2024
‘జాతి రత్నాలు’ సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్ స్టర్ నవీన్ పోలిశెట్టి. తనదైన డిఫరెంట్ ఆటిట్యూడ్‌తో స్క్కీన్ మీద కనిపించే నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు.?
అదేంటీ.! మొన్ననే కదా.! ఏకంగా స్వీటీ అనుష్కతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చేశాడు. తదుపరి ప్రాజెక్టులతో బిజీగా వుండి వుంటాడు.. అనుకోవచ్చు.
కానీ, కాదు ప్రస్తుతం ఈ హీరో రెస్ట్ తీసుకుంటున్నాడు. కాదు కాదు తీసుకోవల్సి వచ్చింది. అందుకు కారణం రీసెంట్గా జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్ కారణంగా చేతికి ఫ్రాక్చర్ అయ్యింది.
చిన్న ఫ్రాక్చరేం కాదండోయ్. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయంటున్నారు. సో, చేతికి కట్టు వేసి కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం చూచాయగా బయటికి రావడంతో ‘ఇంకేముంది.! మనోడు సినిమాలు చేయడానికి పనికి రాడు.. కెరీర్ ఖతమ్..’ అయిపోయింది.. అంటూ ప్రచారం మొదలైంది.
అందుకు ఆయన సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయిన విధానం అందర్నీ ఎంటర్టైన్ చేస్తోంది. తన ప్రాబ్లెమ్‌ని ఓ ఫన్నీ వీడియో ద్వారా అందరికీ కన్వే చేశాడు.
అయితే, అందులో ఫన్నీ కాదండోయ్.. ఆయన ఎమోషన్ కూడా దాగుంది. ఎంతైనా నటుడు కదా.! ఎంత బాధున్నా నవ్వుతూనే వుండాలి. నవ్విస్తూనే వుండాలి అదే చేశాడు నవీన్ పోలిశెట్టి. హ్యాట్సాప్ టు హిమ్. తొందరగా నవీన్ పోలిశెట్టి రికవర్ అయ్యి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..