కృతి శెట్టికి అక్కడైనా కలిసొస్తుందా?
- August 05, 2024
క్యూట్ బ్యూటీ కృతి శెట్టికి ఏం పట్టినా కలిసి రావడం లేదు. ఒకప్పుడు కృతి శెట్టినే కావాలనుకున్నారు హీరోలందరూ. అలా యంగ్‌స్టర్స్ అందరితోనూ నటించేసింది కృతి శెట్టి. కానీ, బ్యాడ్ లక్. అదేంటో ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయ్ దారుణంగా.
దాంతో, కృతి శెట్టిని నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. లాంగ్ గ్యాప్ తర్వాత రీసెంట్గా శర్వానంద్ నటించిన ‘‘మనమే’ సినిమాలో నటించింది. ఈ సినిమా అయినా కృతి శెట్టిని నిలబెడుతుందనుకున్నారంతా.
కానీ జస్ట్ ఓకే అనిపించుకుందంతే. దాంతో మళ్లీ టాలీవుడ్ లైట్ తీసుకుంది కృతి శెట్టిని. అయితే, తమిళంలో కృతి శెట్టికి ఓ బంపర్ ఛాన్స్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు, నయన తార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమాలో కృతి శెట్టికి ఛాన్స్ వచ్చింది.
ప్రదీప్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి లేటెస్ట్గా ఓ స్టిల్ రిలీజ్ చేశారు. ఈ స్టిల్‌లో కృతి శెట్టి భలే క్యూట్‌గా కనిపిస్తోంది. ఈ ఫోటో చూసి ఈ క్యూట్ భామకు టాలీవుడ్ ఎందుకు కలిసి రావడం లేదో కదా.!
ఈ క్యూట్‌నెస్‌ని టాలీవుడ్ జనం మిస్ అవుతున్నారే.. అంటూ ఆమెను అమితంగా అభిమానించేవాళ్లు ఫీలవుతున్నారు. ఏమో, తమిళంలో అయినా కృతి శెట్టికి కలిసొస్తే అంతే చాలు.. అనుకుంటున్నారు కృతి శెట్టి ఫ్యాన్స్.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు