కళ్యాణ్ రామ్ హీరోయిన్ దశ తిరిగిపోయింది.!

- August 05, 2024 , by Maagulf
కళ్యాణ్ రామ్ హీరోయిన్ దశ తిరిగిపోయింది.!

‘అమిగోస్’ సినిమా గుర్తుంది కదా.! కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నటించిన అందాల భామ గుర్తుందా.! ఆషికా రంగనాధ్. నిజంగానే అందాల భామే. అయితే డెబ్యూ కలిసి రాలేదు.
కానీ, తర్వాత అక్కినేని నాగార్జునతో ‘నా సామిరంగ’ సినిమాలో చెలరేగిపోయిందీ అమ్మడు. తొలి సినిమాలో అందాల ఆరబోతతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన ఈ బ్యూటీ సెకండ్ మూవీలో పర్ఫామెన్స్‌తో భళా అనిపించింది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది. తాజాగా మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది ఆషికా రంగనాధ్. తమిళ నటుడు కార్తీ హీరోగా ‘సర్ధార్ 2’ సినిమాలో ఆషికా రంగనాధ్ నటిస్తోంది.
ఈ సినిమాలో ఆల్రెడీ మాళవికా మోహనన్ ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆషికా రంగనాధ్ పేరును కూడా ప్రకటించింది అధికారికంగా చిత్ర యూనిట్.
గతంలో వచ్చిన సెన్సేషనల్ మూవీ ‘సర్ధార్’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోందీ సినిమా. కార్తీ సినిమా అంటే ఖచ్చితంగా విషయమున్న సినిమానే అవుతుంది. అందులోనూ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ కావడంతో భారీగా అంచనాలున్నాయ్.
సో, అమ్మడు ఆషికా రంగనాధ్‌ కెరీర్‌కి ఇది ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com