13న శ్రీహరికోటకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

- August 06, 2024 , by Maagulf
13న శ్రీహరికోటకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

శ్రీహరికోట: ఈ నెల 13న శ్రీహరికోటకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వెళ్లనున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్‌లో జరిగే కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు.

ఇస్రో ఆధ్వర్యంలో గత నెల 14 నుంచి ఈ నెల 15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పవన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ వేడుకలు ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, గుంటూరులలో నిర్వహించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com