యూఏఈలో భారీ వర్షాలు..పొంగిపొర్లుతున్న వాడీలు..!
- August 06, 2024
యూఏఈ: భారీ వర్షాల నేపథ్యలో నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు, దక్షిణ మరియు అంతర్గత ప్రాంతాలలో గంటకు 40 కి.మీ వేగంతో తాజా గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్ ఐన్‌లోని కొన్ని ప్రాంతాలు, అబుదాబి నడిబొడ్డున తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని కొన్ని వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ మేరకు కొన్ని వీడియోలను షేర్ చేసింది.
ఒమన్ సముద్రంలో తాజా గాలులు గంటకు 45 కి.మీ వేగంతో వీస్తాయని, అలాగే కొన్ని సార్లు ఏడు అడుగులకు చేరుకునే అలలతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అబుదాబి, దుబాయ్‌లలో ఉష్ణోగ్రతలు వరుసగా 41℃ మరియు 42℃ వరకు తగ్గాయి. అయితే పర్వత ప్రాంతాలలో ఇది 25℃ వరకు ఉంటుందని తెలిపింది. వాహనదారులు సురక్షితంగా నడపాలని అబుదాబి పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







