రాడార్లతోపాటు ప్రత్యేక కెమెరాలు కూడా!
- June 16, 2016దుబాయ్ పోలీసులు రోడ్లపై నిబంధనల్ని ఉల్లంఘించేవారికోసం రాడార్లతోపాటు 2000 కెమెరాలను కూడా వినియోగించనున్నారు. రోడ్లపై మొత్తం 2000 కెమెరాలను ఇప్పటికే ఇన్స్టాల్ చేసినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. 'వి ఆర్ ఆల్ పోలీస్' పేరుతో ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, అలాగే నిబంధనల్ని అతిక్రమించేవారిని తేలికగా గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశామని కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి చెప్పారు. రమదాన్ తొలి రోజున 250 యాక్సిడెంట్లు జరిగాయనీ, పోలీస్ కంట్రోల్ రూమ్ 2419 ఎమర్జన్సీ కాల్స్‌ని రిసీవ్ చేసుకుందని ఆయన చెప్పారు. మోటరిస్టులు రూల్స్‌ని పాటించడం ద్వారా సేఫ్టీతో కూడిన ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారాయన. ఇవే కాకుండా పెట్రోలింగ్‌ని కూడా స్మార్ట్‌గా మార్చారు. ఈ పెట్రోలింగ్ వాహనాల్లో 360 డిగ్రీల మేర కవర్ చేసేలా కెమెరాలను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







