అమెరికా పర్యటన ముగించుకుని దక్షణ కొరియా బయల్దేరిన సీఎం రేవంత్
- August 11, 2024
హైదరాబాద్: రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఎనిమిది రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం శనివారం కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిర్కో నుంచి దక్షణ కొరియా పర్యటనకు బయలుదేరింది.
నాలుగు రోజుల పాటు కొరాయాలో పర్యటించనున్న ఈ బృందం ఆ దేశంలోని దిగ్గజ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించనుంది. తొలిరోజు ఉదయం యూయూ ఫార్మా ప్రతినిధులతో సామావేశమై తెలంగాణాలో పెట్టుబడుల అంశంపై చర్చించనుంది. ఆ తర్వాత కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది.
హూండేయ్ మోటార్ సంస్థకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించి చర్చలు జరపనుంది. వాటర్ సర్క్యులేషన్ డైరెక్టర్ జనరల్‌తో సమావేశం అనంతరం కొరియా హెరాల్డ్‌తో భేటీ ఎంటుందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రెండోరోజు మంగళవారం రేవంత్ బృందం హ్యాన్ రివర్ ప్రాజెక్టు డిప్యూటీ మేయర్‌తో సమావేశం కానుంది.
ఆ తర్వాత కొరియా బ్యూటీ ట్రేడ్ అసోసియేషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. సామ్సంగ్ ప్రెసిడెంట్ జేబ్ల్యూ కిమ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, సెల్ట్రాన్ సంస్థల అధినేతలతో రేవంత్ బృందం వరుస భేటీలు నిర్వహించనుంది. అదే రోజు హ్యాన్ రివర్ పార్క్ టూర్ నిర్వహించి స్థానికంగా రివర్ ఫ్రంట్ ఏరియాను సందర్శించనుంది.
మూడు రోజుల పాటు దక్షిణ కొరియా పర్యటన అనంతరం సింగపూర్ మీదుగా ఈ బృందం హైదరాబాద్ బయలుదేరనుంది. ఈ నెల 14న బుధవారం ఉదయం 10.50 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణాకు చేరుకోనుంది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







