ప్రఖ్యాత కూచిపూడి డ్యాన్సర్, నటి సంధ్యారాజుకు అరుదైన గౌరవం..
- August 12, 2024
హైదరాబాద్: ప్రఖ్యాత కూచిపూడి నృత్యకారిణి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న తెలుగు నటి సంధ్యారాజుకు అరుదైన గౌరవం దక్కింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. 77వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో నిర్వహించే `ఎట్ హోమ్`సెలబ్రేషన్స్ కి ఆహ్వానిస్తూ లేఖ అందింది.
తన తొలి చిత్రం `నాట్యం`తో రెండు జాతీయ పురస్కారాలను దక్కించుకున్న ఘనత సంధ్యారాజుకు సొంతం. తమిళనాడు బేస్డ్ వ్యాపారవేత్త, రామ్‌కో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ పి.ఆర్.వెంకట్రామరాజా పుత్రిక సంధ్యారాజు. హైదరాబాద్‌లో నిశృంఖల డ్యాన్స్ అకాడెమీ, నిశృంఖల ఫిల్మ్ ఫౌండర్‌గా అనేక కార్యకలాపాలు చేస్తున్నారు. తన నృత్య కళతో ప్రపంచ యవనిక మీద అసమానమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు సంధ్యారాజు. ప్రత్యక్ష నృత్య ప్రసారాల్లో పాల్గొనడమే కాదు, చలనచిత్ర రంగంలోనూ తనదైన ముద్రతో దూసుకుపోతున్నారు.
నటిగా, క్లాసికల్ డ్యాన్సర్‌గా, జాతీయ పురస్కారాన్ని అందుకున్న కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా... భారతీయ సాంస్కృతిక రంగంలో ఎంతో మందికి స్ఫూర్తి పంచుతున్నారు సంధ్యారాజు. ఎట్ హోమ్ రిసెప్షన్ ని ఆగస్టు 15 సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహిస్తారు. ఆగస్టు 15న ఉదయం జెండా వందనం పూర్తవగానే సాయంత్రం ఎట్ హోమ్ రిసెప్షన్‌ని రాష్ట్రపతి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
ఈ రిసెప్షన్‌లో రాష్ట్రపతి మన కట్టుబొట్టును ప్రతిబింబించే వస్త్రాలలో కనిపిస్తారు. హాజరైన అతిథులతో ఆత్మీయంగా సమావేశమవుతారు. ఈ రిసెప్షన్‌కి సీనియర్ రాజకీయనాయకులు, మిలిటరీ అధికారులు, ఇతరత్రా రంగాల్లో క్రియాశీలక వ్యక్తులు హాజరవుతారు. అతిథులు ఫార్మల్, సెమీ ఫార్మల్ వేషధారణలో హాజరవుతారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







