కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
- August 12, 2024
న్యూఢిల్లీ: కవిత బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపింది. వాదనల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది.
ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ నెల 8న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆమె తిహాడ్ జైలులోనే ఉన్నారు. కవిత తిహాడ్ జైలులో ఉండగానే ఏప్రిల్ 15న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







