స్కిల్ యూనివర్శిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర..ఉత్తర్వులు జారీ
- August 15, 2024
హైదరాబాద్: స్కిల్ యూనివర్శిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర నియామకం అయ్యారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్‌పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. అటోమొబైల్, ఏయిరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ వంటి ప్రముఖ రంగాల్లో మహీంద్రా గ్రూపు సంస్థలకు ఆయన చైర్మన్‌గా ఉన్నారు.
ముఖ్యమంత్రి ఇటీవలి కాలంలోనే ఆనంద్ మహీంద్రాతో సమావేశమైన స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, లక్ష్యాలను వివరించి దానికి చైర్ పర్సన్ గా కొనసాగాలను కోరారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ ఇండియా యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఏడాది పాటు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







