సౌదీలో SR141 బిలియన్లు ఖర్చుపెట్టిన విదేశీ పర్యాటకులు..!
- August 15, 2024
రియాద్: గత సంవత్సరంలో విదేశాల నుండి సౌదీ అరేబియాకు వచ్చిన పర్యాటకుల మొత్తం ఖర్చు SR141 బిలియన్లకు మించిందని పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం వ్యయంలో ఆతిథ్య సౌకర్యాలపై ఖర్చు అత్యధికంగా SR45 బిలియన్లు ఖర్చు చేశారు.
గత సంవత్సరంలో షాపింగ్ కోసం ఇన్‌బౌండ్ టూరిస్ట్‌లు చేసిన ఖర్చు SR25.5 బిలియన్లు దాటిందని, రవాణా కోసం చేసిన ఖర్చు సుమారు SR21.5 బిలియన్లు అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆహారంపై ఖర్చు SR19.4 బిలియన్లకు చేరుకుందని, ఇతర ప్రయోజనాలపై ఖర్చు SR25.5 బిలియన్లకు మించిందని నివేదిక పేర్కొంది. వినోదం కోసం ఇన్కమింగ్ టూరిస్ట్‌ల ఖర్చు SR4 బిలియన్లను అధిగమించిందని మంత్రిత్వ శాఖ నివేదిక చూపించింది. గత సంవత్సరంలో మొత్తం దేశీయ మరియు విదేశీ పర్యాటకుల సంఖ్య 109 మిలియన్లకు చేరుకుందని నివేదిక తెలిపింది. వీరిలో 27 మిలియన్లకు పైగా విదేశీ పర్యాటకులు ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







