వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ...
- June 16, 2016
వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. గతేడాది విడుదలైన మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో ప్రేక్షకులను అలరించిన కథానాయిక సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ నేపథ్యంలో మా శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. దర్శకుడు శేఖర్ కమ్ముల అద్భుతమైన స్టోరీ టెల్లర్. వరుణ్‌తేజ్ ఇప్పటికే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జులై 25న ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించి, ఆగస్టు చివరికి తెలంగాణ షెడ్యూల్ మొత్తం పూర్తి చేసుకుని, ఆక్టోబర్‌లో అమెరికాలో షూటింగ్ జరుపనున్నాం.
దీంతో షూటింగ్ పూర్తి అవుతుంది. చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రానికి కెమెరా: విజరు కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్. ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాను' అని అన్నారు.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







