54% ఉపాధి లక్ష్యాన్ని సాధించిన ఒమన్
- August 16, 2024
మస్కట్: ఒమన్‌లోని కార్మిక మంత్రిత్వ శాఖ 2024 మొదటి అర్ధభాగంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను కవర్ చేస్తూ 54 శాతం అచీవ్‌మెంట్ రేటును సాధించింది. ఎక్కువ మంది ఒమానీ జాతీయులను లేబర్ మార్కెట్లోకి చేర్చాలనే లక్ష్యంతో జాతీయ విధానాలు రూపొందించి అమలు చేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ వేదించింది.
జనవరి నుండి జూన్ 2024 చివరి వరకు ఉన్న డేటా ప్రకారం మొత్తం 14,074 మంది వ్యక్తులు రెండు రంగాలలో ఉద్యోగాలు పొందారు. లక్ష్యం 10,000 మందిలో ప్రభుత్వ రంగంలో 6,963 మందికి ఉపాధి కల్పించగా, ప్రైవేట్ రంగంలో 16,000 మందిలో 7,111 మందికి ఉపాధి కల్పించారు. ఉపాధికి సంబంధించిన శిక్షణా కార్యక్రమాల పరంగా ప్రభుత్వ రంగంలో 2,000 లక్ష్య నియామకాలలో 305 పూర్తి చేసింది. ప్రైవేట్ రంగం 7,000 లక్ష్య నియామకాలలో 1,107 పూర్తి చేసింది. మొత్తంమీద 15,486 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందారు. మొత్తం ప్రణాళిక లక్ష్యం 35,000లో 44.25 శాతం సాధించారు. ఒమన్‌లో నిరంతర ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో ఉపాధి చొరవ కీలక పాత్రను మంత్రిత్వ శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!