ప‌లువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు..

- August 16, 2024 , by Maagulf
ప‌లువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పది మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేర‌కు (శుక్రవారం) డీజీపీ ద్వారకా తిరుమలరావు బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. సీనియర్ అధికారి సత్య ఏసుబాబును డీజీపీ అఫీస్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. గ్రేహూండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా సునీల్‌ షరాన్‌, గ్రేహూండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ను, ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ కమాండెంట్‌గా కేవీ మురళీకృష్ణను, పార్వతీపురం ఎస్‌డీపీవోగా అంకిత మహవీర్‌ నియమించారు.

గుంతకల్లు రైల్వే ఎస్ఆర్‌పీగా రాహుల్ మీనా, విజయవాడ డీసీపీగా మహేశ్వరరాజ్, ఇంటలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఎఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, అనంతపురం ఎస్పీగా జగదీశ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com