వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం..
- August 17, 2024
న్యూ ఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ భారత్ చేరుకున్నారు. పారిస్ నుంచి బయలుదేరిన ఆమె శనివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న వినేశ్ ఫొగాట్ సన్నిహితులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారత ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ కూడా ఉన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను, తన సన్నిహితులను చూసి వినేశ్ ఫొగాట్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, రెజర్లు సాక్షి మాలిక్, భజరంగ్ పునియా, తదితరులు దగ్గరకు తీసుకొని ఓదార్చారు. విమానాశ్రయం బయటకు డప్పు నృత్యాలతో అభిమానులు వినేశ్ పొగ్రాట్ కు పెద్దుత్తున స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. దేశంకోసం ఆమె ఏం చేసిందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. ఆమె ఈ ప్రశంసలు, గౌరవానికి అర్హురాలేనని అన్నారు. వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ… నాదేశ ప్రజల నుంచి నాకు లభించిన ఈ ప్రేమ, గౌరవానికి నేను కృతజ్ఞతురాలినని పేర్కొన్నారు. వినేశ్ తన స్వగ్రామమైన చర్కీదాద్రీకి వాహనాలపై ర్యాలీగా వెళ్లారు. పలువురు జాతీయ జెండాలను చేతభూమి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం స్వగ్రామంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ కు చేరిన వినేశ్.. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీలు చేసినా సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె విజ్ఞప్తిని కాస్ కొట్టివేసింది.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







