ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..
- August 18, 2024 
            న్యూ ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమిత్ షాతో సీఎం చంద్రబాబు సుమారు గంటన్నర పాటు సమావేశం అయ్యారు. అమిత్ షా, చంద్రబాబుల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. అమిత్ షా, నడ్డాతో భేటీలో రాజకీయ అంశాల గురించి చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.
అటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన భేటీలో ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి కూడా పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం కోరారు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి ఇస్తామని ప్రకటించిన నిధుల గురించి ఆయన వాకబు చేశారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కేంద్ర పెద్దలను కోరారు సీఎం చంద్రబాబు. వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న నిధులు ఇవ్వాలని, రుణాలు రీషెడ్యూల్ చేయాలని కేంద్ర పెద్దలకు విన్నవించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
తాజా వార్తలు
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..







