శివాజీ–లయ జంటగా కొత్త సినిమా..
- August 18, 2024
హైదరాబాద్: గతంలో శివాజీ–లయ కలిసి చేసిన ‘మిస్సమ్మ’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘అదిరిందయ్యా చంద్రం’.. సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఈ ఇద్దరు కూడా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివాజీ ఆల్రెడీ కంబ్యాక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. లయ కూడా ఇటీవలే కంబ్యాక్ ఇచ్చి వరుస ఆఫర్స్ దక్కించుకుంటుంది.
ఒకప్పుడు హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శివాజీ – లయ ఇప్పుడు మళ్ళీ కలిసి నటించబోతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివాజీ లయ జంటగా కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి శివాజీనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగగా నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు, దర్శకుడు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందుకోగా, బోయపాటి శ్రీను ఫస్ట్ డైరెక్షన్ చేసారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 20 నుంచి మొదలు కానుంది. ఒకప్పటి సూపర్ హిట్ పెయిర్ శివాజీ–లయ మళ్ళీ కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







