వాట్సాప్ యూజర్లకు 3 బెస్ట్ ట్రిక్స్..

- August 18, 2024 , by Maagulf
వాట్సాప్ యూజర్లకు 3 బెస్ట్ ట్రిక్స్..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. సెకన్లలో ఎవరితోనైనా త్వరగా కమ్యూనికేట్ అయ్యేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. కానీ, మీరు వాట్సాప్‌లో కొన్ని ట్రిక్‌లను ప్రయత్నించడం ద్వారా మీ మెసేజ్‌ను అత్యంత వేగంగా పంపుకోవచ్చు. అందులో ఒకటి.. మీరు ఎవరి ఫోన్ నంబర్‌ను మీ వాట్సాప్ కాంటాక్టుల్లో సేవ్ చేయకుండానే చాట్ చేయవచ్చు. మరో ట్రిక్ ఏంటంటే..? వాట్సాప్‌లో హైక్వాలిటీ ఫొటోలను పంపే ట్రిక్. ఇక, మూడవ ట్రిక్.. మెసేజింగ్ యాప్‌లో మీ ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయడం.. ఈ మూడు ట్రిక్స్ ద్వారా వాట్సాప్ యూజర్లు తమ ప్రైవసీని ఇలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో నెంబర్ సేవ్ చేయకుండా చాటింగ్:
చాలా మంది వాట్సాప్ యూజర్లు ఎదుర్కొంటున్న ఒక సమస్య. వాట్సాప్‌లో నంబర్‌ను సేవ్ చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు. ఏదైనా పని కోసం చాట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వాట్సాప్ యూజర్లకు ప్రైవసీ ప్రొటెక్షన్ పొందవచ్చు. కేవలం సెకన్లలో ఇతరుల ఫోన్ నంబర్‌లను వాట్సాప్‌లో సేవ్ చేయకుండా చాట్ చేయవచ్చు.

ఏదైనా ఫోన్ నంబర్‌ను కాపీ-పేస్ట్ చేసి.. మీకు లేదా ఏదైనా కాంటాక్టుకు పంపాలి. మీరు వాట్సాప్ లో కాంటాక్టులో పంపిన నెంబర్‌పై Tap చేయండి. అక్కడ మీకు వాట్సాప్ మరికొన్ని ఆప్షన్లను చూపిస్తుంది. మొదటి ఆప్షన్‌పై నొక్కండి. ఆ ఫోన్ నెంబర్ (XXXXX)తో చాట్ చేయండి. ఇక్కడ, మీరు ఫోన్ నంబర్‌ను సేవ్ చేయకుండా చాట్ చేయొచ్చు.

వాట్సాప్ లో హైక్వాలిటీ ఫొటోలను పంపాలంటే?
ఫోన్ కాల్ లేదా మెసేజ్‌లో ఎవరితోనైనా త్వరగా కనెక్ట్ కావాలంటే వాట్సాప్ బెస్ట్ మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. కానీ, చాలా మంది యూజర్లను ఇబ్బంది పెట్టే విషయం ఏమిటంటే.. హై క్వాలిటీ ఫొటోలు లేదా వీడియోలను పంపడం కుదరదు. అదృష్టవశాత్తూ, వాట్పాప్ ఇప్పుడు యాప్ సెట్టింగ్‌లలో ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

బెస్ట్ క్వాలిటీతో మీడియాను పంపేందుకు యూజర్లను అనుమతిస్తుంది. అయినప్పటికీ, ప్లాట్‌ఫారమ్ కచ్చితమైన క్వాలిటీ లిమిట్ ఎంత అనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ, సాధారణ షేరింగ్‌తో పొందే దాని కన్నా మెరుగైన అప్‌లోడ్ క్వాలిటీని యూజరర్లకు అందించాలి. ఇందుకోసం.. Settings> Storage And Data > Photo Upload Quality> Best quality ఆప్షన్ ఎంచుకోండి.

బోనస్ టిప్ మీకోసం:

  • వాట్సాప్ యూజర్లు గూగుల్ డిస్క్‌కి కొన్ని ఫొటోలు లేదా వీడియోలను అప్‌లోడ్ చేయడం, ఫైల్‌ను క్రియేట్ చేయడం, క్వాలిటీ కోల్పోకుండా యూజర్లకు పంపడం వంటివి కూడా ఎంచుకోవచ్చు. వాస్తవానికి, (Gmail)లో ‘insert from Drive’ ఆప్షన్ ఉంది. మీరు ఫొటోలు లేదా వీడియోలను exchange చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. మీరు యాప్‌లోని అటాచ్‌మెంట్ బటన్‌పై నొక్కినప్పుడు ఫీచర్ కనిపిస్తుంది.
  •  టెలిగ్రామ్‌లో హై క్వాలిటీ గల ఫైల్‌లను షేర్ చేయడానికి కూడా ఎంచుకోవచ్చు. ఇందుకోసం.. మీరు యాప్‌లోని ఫైల్‌ల ఫీచర్‌ని ఉపయోగించి ఫొటోలు లేదా వీడియోలను షేర్ చేయడానికి ఎంచుకోవచ్చు.

వాట్సాప్‌లో ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయండి:
వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అని ఎవరూ చూడకూడదనుకునే యూజర్లు తమ యాప్ సెట్టింగ్ సెక్షన్‌లో తమ స్టేటస్ హైడ్ చేయొచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ ఇటీవల ప్రైవసీపై అవగాహన ఉన్న యూజర్ల కోసం ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. Settings > Privacy > Last seen and online ఆప్షన్‌కు వెళ్లాలి. ఇక్కడ మీరు ‘Nobody’, ‘Same as last seen’ ఆప్షన్లను నొక్కాలి. మీరు వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరూ చూడలేరు. మీరు సెట్టింగ్‌లను మార్చకపోతే.. మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా సీక్రెట్‌గా చాట్ చేయొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com