సాఫ్ట్‌వేర్ జాబ్ పేరుతో ఘరానా మోసం

- August 18, 2024 , by Maagulf
సాఫ్ట్‌వేర్ జాబ్ పేరుతో ఘరానా మోసం

హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్ లో మరో సాఫ్ట్ వేర్ కన్సల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ లో ఉన్న ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ కంపెనీ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి కార్యాలయానికి తాళాలు వేసింది.

అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటైంది. ఈ కంపెనీ దాదాపు 600 మంది ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో కేంద్రాలు ఏర్పాటు చేసి సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన నిరుద్యోగులు ట్రైనింగ్, జాబ్ కోసం ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు కట్టారు. కొన్ని రోజులు వారికి మాదాపూర్ లో ట్రైనింగ్ ఇస్తున్నట్లు నటించారు. మొత్తం 10 కోట్ల రూపాయలు వసూలు కాగానే రాత్రికి రాత్రి బోర్డు తిప్పేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com