ఆర్జీవీ, ప్రభాస్ ని పొగిడిన సీఎం రేవంత్...
- August 19, 2024
హైదరాబాద్: పన్నేండేళ్ల క్రితం మూతపడ్డ నిజాం చక్కెర పరిశ్రమను (NSF) తిరిగి తెరిపించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.పరిశ్రమ పునరుద్ధరణకు అవసరమైన నిధులను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. అఖిల భారత క్షత్రియ సేవా సమాజ్ ఆదివారం సాయంత్రం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సీఎం రేవంత్ అభినందన సభను నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. క్షత్రియులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, హైదరాబాద్ లో క్షత్రియ సమాజ్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని, అనుమతులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈసామాజికవర్గానికి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ లో ప్రాధాన్యత కల్పిస్తామని, వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ టికెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టు బడులు పెట్టేందుకు క్షత్రియులు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో రాజుల పేరు చెబితే తొలుత తమకు గుర్తొచ్చేది నటుడు స్వర్గీయ కృష్ణంరాజు అని రేవంత్ పేర్కొన్నారు. క్షత్రియ సమాజానికి చెందిన దర్శకులు రాంగోపాల్ వర్మ తనకు మంచి మిత్రుడని తెలిపారు. హాలీవుడ్ తో పోటీ పడుతున్న బాహుబలి ప్రభాస్ సైతం క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన క్షత్రియ సమాజానికి చెందిన రాజుల వల్లే హైదరాబాద్లోని కొంపల్లి ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పారు. ఏ రంగంలో రాజులు ప్రవేశించినా అందులో వాళ్లు విజయవంతమవుతారని, రాజులు రాణించడానికి ప్రధాన కారణం వాళ్ల కఠోర శ్రమ, పట్టుదల అని ఆయన చెప్పారు.హైదరాబాద్ లో అన్ని రంగాల అభి వృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







