పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోడీ..
- August 19, 2024
న్యూ ఢిల్లీ: ప్రధాని మోడీ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనలకు వెళ్లబోతున్నారు. ఆగస్టు 21న పోలాండ్ దేశంలో, ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు.
ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటీవల రష్యాలో పర్యటించిన మోడీ, తాజాగా ఉక్రెయిన్ వెళ్లబోతున్నారు.
పోలాండ్ పీఎం డొనాల్డ్ టస్క్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ పంపిన ఆహ్వానాల మేరకు ప్రధాని మోడీ ఆయా దేశాల్లో పర్యటించనున్నారు. 30 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని తొలిసారిగా ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఇటీవల రష్యాకి వెళ్లిన ప్రధాని మోడీ ''రష్యాని అన్ని కాలాల మిత్రుడు''గా పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యని పరిష్కరించుకోవాలని పదేపదే భారత్ చెబుతోంది. యుద్ధం ప్రస్తుత కాలంలో పరిష్కారం కాదని ప్రధాని మోడీ పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే, ఇటీవల ప్రధాని మోడీ రష్యా పర్యటనపై అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, పాశ్చాత్య దేశాలతో భారత్ సంబంధాలను నార్మల్ చేయడానికి ప్రధాని ఉక్రెయిన్ పర్యటన సహకరిస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పోలాండ్‌లో 45 ఏళ్ల తర్వాత పర్యటించే తొలి భారత ప్రధానిగా నరేంద్రమోడీ రికార్డ్ సృష్టించబోతున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తయ్యాయి. పోలాండ్ దేశంలో 25,000 మంది భారతీయులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల్ని రక్షించడానికి పోలాండ్ సహకరించింది. ఇదే కాకుండా 1940లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 6000 మంది పోలాండ్ మహిళలు, పిల్లలకు భారతదేశంలోని జామ్‌నగర్, కోల్హాపూర్ రాజులు ఆశ్రయం ఇచ్చారు. ఇప్పటికీ ఈ విషయాన్ని ఆ దేశం గుర్తుంచుకుంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







