అమెరికాలో అధికారికంగా దీపావళి వేడుకలు
- August 20, 2024
అమెరికా: భారతీయ విశిష్ట పండుగ దీపావళి పండుగను అధికారికంగా గుర్తించడంతోపాటు, అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి వారంగా గుర్తిస్తున్నట్లు నెబ్రాస్కా రాష్ట్ర గవర్నర్ జిమ్ పిల్లెన్ కార్యాలయం ప్రకటించింది. అలాగే అక్టోబర్ నెలను నెబ్రాస్కా రాష్ట్రంలో హిందూ హెరిటేజ్ మాసంగా కూడా గుర్తిస్తున్నట్లు ప్రకటనలో తెలియజేశారు. తరతరాలు గా వస్తున్న హిందూ సాంస్కృతిక వారసత్వం, సనాతన ధర్మం, సంస్కృతి మరియు సంప్రదాయాల పరిరక్షణతోపాటు దీపావళి వేడుకలను ఉల్లాసంగా జరుపుకోవడం కోసం అమెరికాలోని భారతీయ హిందూ సంఘం చేసిన గొప్ప కృషి వల్ల ఇది సాధ్యమైంది. నెబ్రాస్కా రాష్ట్రంలోని హిందూ సోదరులంతా దీపావళి వేడుకలను మరియు హిందూ వారసత్వ నెల ఉత్సవాలను మీ కుటుంబంతో, స్నేహితులతో పాటు కమ్యూనిటీతో ఘనంగా జరుపుకోవాలని హిందూ నాయకులు కోరారు.
నెబ్రాస్కా స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ లింకన్‌లో వార్నర్ లెజిస్లేటివ్ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో భారతీయ సంస్కృతీ గొప్పతనాన్ని తెలియజేస్తూ, దీపావళి పండుగ ప్రాముఖ్యతపై ప్రసంగించిన డాక్టర్ ఫణి తేజ్ ఆదిదం గారికి హిందువుల తరపున హృదయ పూర్వక ధన్యవాదములను తెలియజేశారు. అలాగే అధికారికంగా ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావటానికి మల్లికా జయంతి, కొల్లి ప్రసాద్, నవీన్ కంటెం, డాక్టర్ ఫణి తేజ్ ఆదిదం, వెంకట్ జయంతి, రాజా కోమటిరెడ్డి, టాటారావు కోసూరి, అనిల్ పోతినేని, తపన్ దాస్, శైలేందర్, అరుణ్ కుమార్ పాండిచ్చేరి, దేవిక పాండిచ్చేరి, మాధవి, పీయూష్ శ్రీవాస్తవ్, ప్రవీణ్ గుమ్మడవల్లి, శ్రీపత్ కాంబ్లే, రామకృష్ణ కిలారు తదితరులు విశేషంగా కృషి చేశారు. అధికారికంగా ప్రకటన రావడం పట్ల పలువురు కమ్యూనిటీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..