భారత ప్రవాసులకు తక్కువకే విమాన ఛార్జీలు..!
- August 20, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లో ఉన్న ఒక భారతీయ వ్యాపార సమూహం నివాసితులకు తక్కువ ధరకే విమాన టిక్కెట్లను అందజేస్తుంది. ఈ మేరకు ఒక విమానయాన సంస్థను ప్రారంభించనున్నారు. మూడు దశాబ్దాలకు పైగా ట్రావెల్ పరిశ్రమలో పనిచేస్తున్న అల్హింద్ గ్రూప్, భారతదేశంలో తన దేశీయ విమానయాన సంస్థను ప్రారంభించడానికి అవసరమైన తప్పనిసరి క్లియరెన్స్‌ను తాజాగా పొందింది. అనుమతులు పొందే చివరి దశలో ఉన్నామని గ్రూప్ చైర్మన్ మహ్మద్ హరీస్ చెప్పారు. “గత వారం, మేము కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (CIAL)లో అధికారులతో సమావేశమయ్యాము. మేము విమానాశ్రయంలో ల్యాండింగ్ అనుమతి కోసం అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాము. ”అని వివరించారు. ఎయిర్‌లైన్‌ను ప్రారంభించడానికి తాము ఇంతకు ముందు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అందుకున్నామని, జనవరి 2025 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని తాము ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అల్హింద్ ఎయిర్‌లైన్ మూడు ATR-72 టర్బోప్రాప్ విమానాలతో ప్రారంభమవుతుందన్నారు. ప్రారంభంలో కేవలం భారతీయ నగరాలకు మాత్రమే సేవలందిస్తున్న సంస్థ వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. తాము మూడు విమానాలతో ప్రారంభిస్తామని, తమకు 20 విమానాలు వచ్చిన వెంటనే అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభిస్తామన్నారు. తమ మొదటి గమ్యం యూఏఈ అవుతుందని పేర్కొన్నారు. ఇక్కడ ఉండే భారత నివాసితులకు సేవలందించేందుకు మా టిక్కెట్ ధరలను మార్కెట్‌లో అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచాలని తాము లక్ష్యంగా పెట్టుకుంటామన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







