యూఏఈలో గృహ కార్మికుల కోసం కొత్త చ‌ట్టం..!

- August 20, 2024 , by Maagulf
యూఏఈలో గృహ కార్మికుల కోసం కొత్త చ‌ట్టం..!

యూఏఈ: గృహ కార్మికులు, వారి యజమానుల మధ్య వివాదాలు మంత్రిత్వ శాఖ మానవ వనరులు, ఎమిరేటైజేషన్ (మోహ్రే) ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలతో ఇక‌పై వివాదాలు వేగంగా పరిష్కారం అవుతాయి.  గత వారం ప్రకటించిన కొత్త చట్టం రెండు పార్టీల మధ్య న్యాయమైన, సమానమైన సంబంధాన్ని సృష్టిస్తుందని గృహ కార్మికులు మరియు వలస హక్కుల న్యాయవాది తెలిపారు. Dh50,000 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఏదైనా కేసు ఇప్పుడు మోహ్రే ద్వారా నేరుగా పరిష్కరించబడుతుంద‌న్నారు. కోర్టుకు సూచించాల్సిన అవసరం లేదని, దీంతో నిర్ణీత గడువులోగా సామరస్యపూర్వక పరిష్కారం అవుతుంద‌న్నారు. అలారాకుంటే, మొహ్రే వివాదాన్ని చివరి ప్రయత్నంగా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు బదులుగా,  కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కు సూచిస్తార‌ని పేర్కొన్నారు. వివాదానికి సంబంధించిన ఏ పక్షమైనా - నోటిఫై చేసిన 15 పని రోజుల‌లోగా మంత్రిత్వ శాఖ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో దావా వేయవచ్చు. దాంతో మంత్రిత్వ శాఖ నిర్ణయం అమలు నిలిపివేయబడుతుందన్నారు.    
కొత్త చట్టం గృహ కార్మికులకు ఎలా రక్షణ కల్పిస్తుంది?
దుబాయ్‌లోని దాదాపు 100 మంది నానీలు మరియు గృహ కార్మికులతో కూడిన ఫిలిపినో కసంబాహే క్లబ్ (FKC) వ్యవస్థాపకులలో ఒకరైన అనలిజా విల్లావో మాట్లాడుతూ.. మోహ్రే కొత్త అధికారాలను ప్రశంసించారు. మోహ్రే ఇప్పుడు త‌మ‌ సమస్యలు, ఆందోళనలను వెంటనే పరిష్కరించగలద‌ని తాము మరింత ఆశాజనకంగా ఉన్నామ‌న్నారు.  గృహ కార్మికులు ఇప్పుడు తప్పు చేసిన యజమానులపై చట్టపరమైన చర్యలను కొనసాగించడానికి అధికారం కలిగి ఉంద‌న్నారు. ఒక సాధారణ కేసు కోసం న్యాయవాది కోసం సుమారు Dh15,000 ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌న్నారు. లేబర్ కేసులను కోర్టు ఫీజు నుండి మినహాయించినప్పటికీ, దాదాపు 50 శాతం కేసులను గృహ కార్మికులు సుదీర్ఘ కోర్టు విచారణకు నిలబడే వనరులు లేని కారణంగా విడిచిపెడ‌తార‌ని పేర్కొన్నారు. ఇప్పుడు మొహ్రే అధికారాలకు సవరణ ద్వారా  కార్యాలయంలో సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా అభివ‌ర్ణించారు.  ఇది గృహ కార్మికులకు రక్షణ కల్పిస్తుంద‌ని అల్మాజర్ వివ‌రించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com