శ్రీవారి సేవలో మంత్రి టిజి భరత్
- August 20, 2024
తిరుమల: తిరుమల శ్రీవారిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ… సిఎం చంద్రబాబు ఒక పారిశ్రామిక బ్రాండ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి పారిశ్రామిక సంస్థలు తరలి వస్తున్నాయని తెలిపారు. రెండు లక్షల మందికి ఉద్యోగవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు సోమవారం శ్రీ సిటీలో పలు సంస్థల ప్రారంభోత్సవం చేశారని తెలిపారు. వంద రోజుల ప్రభుత్వంలో చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







