యూఏఈ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్‌

- August 20, 2024 , by Maagulf
యూఏఈ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్‌

యూఏఈ: 2024 మహిళల టి20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ యూఏఈ వేదికగా జరగనుంది.ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ICC) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డు(BCB) మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వాల్సి ఉండగా..ఆతిథ్యంపై వెనక్కి తగ్గడం సిగ్గుచేటని ఐసిసి ఎగ్జిక్యూటివ్‌ జియోఫ్‌ అల్లార్డిన్‌ ఆ ప్రకటనలో వెల్లడించారు.షెడ్యూల్‌ ప్రకారం 9వ ఎడిషన్‌ టి20 మహిళల ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉండగా.. అక్కడ నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఐసిసి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.టి20 మహిళల ప్రపంచకప్‌ మార్పుకు తొలుత శ్రీలంక, భారత్‌లను నిర్వహించమని కోరినా..ఆ రెండు దేశాలు సుముఖంగా లేకపోవడంతో ఐసిసి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 3నుంచి 20వరకు యూఏఈ వేదికగా ఈ టోర్నమెంట్‌ జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com