ఏపీ ఫార్మాలో పేలిన రియాక్టర్లు : 18 మందికి తీవ్ర గాయాలు

- August 21, 2024 , by Maagulf
ఏపీ ఫార్మాలో పేలిన రియాక్టర్లు : 18 మందికి తీవ్ర గాయాలు

అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ లోని ఓ ఫార్మా కంపెనీ లో ఘోర ప్రమాదం జరిగింది. సెజ్‌ లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్‌ పేలి  సుమారు 18 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com