పోలాండ్ చేరుకున్న ప్రధాని మోడీ...

- August 21, 2024 , by Maagulf
పోలాండ్ చేరుకున్న ప్రధాని మోడీ...

ప్రధాని మోడీ రెండు విదేశీ పర్యటనల్లో భాగంగా బుధవారం పోలాండ్ చేరుకున్నారు. అక్కడ ఘన స్వాగతం లభించింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మోడీకి స్వాగతం పలికారు.

ఈ పర్యటన భారతదేశం-పోలాండ్ స్నేహానికి ఊపందుకుంటుందని… ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత్‌, పోలెండ్‌ల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ అక్కడ పర్యటిస్తున్నారు. అయితే గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలెండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్‌ పోలెండ్‌ను సందర్శించారు.

గురువారం పోలాండ్ నుంచి ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. రైల్లో 10 గంటలు ప్రయాణం చేసి మోడీ కీవ్ చేరుకుంటారు. దాదాపు 7 గంటల పాటు అక్కడ గడుపుతారు. ఇరు దేశాల సంబంధాలపై చర్చించనున్నారు. రష్యాతో యుద్ధం తర్వాత మోడీ ఉక్రెయిన్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై తిరిగి మళ్లీ రైలు మార్గంలోనే పోలెండ్‌ చేరుకుంటారు. అనంతరం పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగొస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com