తిరుమల శ్రీవారి సన్నిధిలో చిరంజీవి దంపతులు
- August 22, 2024
తిరుమల: మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన బర్త్ డే సందర్భంగా ఆయన సతీ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చిరంజీవి దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందజేశారు. 1955 ఆగస్ట్ 22న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో చిరంజీవి జన్మించారు. మరోవైపు తమ అభిమాన నటుడి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగ్యా ఫ్యాన్స్ భారీ కార్యక్రమాలను చేపడుతున్నారు. రక్తదానం, అన్నదానం తదితర సేవాకార్యక్రమాలను చేస్తున్నారు. విదేశాల్లో సైతం చిరు అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







