ఫార్మా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం
- August 22, 2024
అమరావతి: అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు జిల్లా కలెక్టర్ హరిందర్ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం ఇస్తామని, ఎంత మొత్తం అనేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కాకినాడకు చెందిన చల్లపల్లి హారిక (22) మరణించారు. తాపీ మేస్త్రీగా పని చేసే తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోయారు. కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె ఏడాది క్రితం ‘ఎసెన్షియా’లో చేరారు. రాఖీ పండుగకు కాకినాడకు రాగా మరో రెండు రోజులు ఉండాలని సోదరులు కోరినా యాజమాన్యం అనుమతించకపోవడంతో నిన్న ఉదయం వెళ్లారు. మృత్యువు వెంటాడటంతో ప్రమాదంలో ప్రాణాలు వదిలారు. అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పేలుడుకు 18 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణాలపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ‘రియాక్టర్లో తయారైన మిథైల్ టెర్ట్-బ్యుటైల్ ఈథర్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మార్చుతుండగా లీకై ఆవిరిగా మారింది. ఆ వాయువు వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు జరిగింది. ఆ లీకేజీ మిశ్రమం ఎలక్ట్రిక్ ప్యానల్‌పై పడటంతో మంటలు చెలరేగాయి’ అని పేర్కొంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు