శ్రీవారి భక్తులకు అలెర్ట్ ….
- August 22, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో స్వామి వారి వాహన సేవలు వీక్షించేందుకు తిరుమలకు సామాన్య భక్తులు సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారని భావిస్తున్న టీటీడీ, ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగానే బ్రహ్మోత్సవాలు కు అంకురార్పణ జరిగే అక్టోబరు 3 నుండి 12 చక్రస్నానం నిర్వహించేంత వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను సైతం టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని టీటీడీ కోరింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు