ఇంగ్లండ్ టూర్.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ
- August 22, 2024
ముంబై: భారత్-ఇంగ్లండ్ టీమ్స్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్ జరగనుంది. రెండు జట్ల మధ్య చివరిసారిగా ఆ దేశంలో 2021లో ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. దీనిని 2-2తో సమంగా పంచుకున్నాయి. ఒక టెస్టు డ్రాగా ముగిసింది. ఇప్పుడీ సిరీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫోర్త్ సైకిల్ ప్రారంభం కానుంది.ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. ఫస్ట్ టెస్ట్ జూన్ 20 నుంచి 24 వరకు, సెకండ్ టెస్ట్ జులై 2 నుంచి 6 వరకు, థర్డ్ టెస్ట్ జులై 10 నుంచి 14 వరకు, ఫోర్త్ టెస్ట్ జులై 23 నుంచి 27 వరకు, ఫిఫ్త్ టెస్ట్ జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరగనుంది. వచ్చే ఏడాది జూన్-జులై మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు