తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం..
- August 23, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని జాగ్రత్తల చెప్పినా శ్రీవారి భక్తుల మోసాల బారిన పడుతూనే ఉన్నారు. భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు సొమ్ములు చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన నలుగురు భక్తుల మోసగాళ్ల బారిన పడ్డారు. నకిలీ టెకెట్లతో స్వామివారి కళ్యాణోత్సవానికి వచ్చిన వీరిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించడంతో ఈ మోసం వెలుగు చూసింది. ఇంటర్నెట్ నిర్వాహకుడి నుంచి శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లు కొనుగోలు చేసినట్టు భక్తులు తెలిపారు. దీంతో తమిళనాడు వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురైపై పోలీసులకు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు.
అన్నాదురై ఆన్‌లైన్‌లో నకిలీ వివరాలతో టికెట్లు తీసినట్టు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. పాస్‌పోర్టులోని చివరి నంబర్లను మార్చేసి శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసినట్టు కనుగొన్నారు. ఈ టికెట్లను ఎక్కువ రేటుకు భక్తులకు విక్రయించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
శ్రీవారి దర్శనం టికెట్లు, ఆర్జిత సేవ టికెట్లకు దళారీలను ఆశ్రయించద్దని భక్తులను టీటీడీ కోరింది. టీటీడీ అధికారిక వెట్‌సైట్‌లో భక్తులే నేరుగా టికెట్లు పొందాలని సూచించింది. స్వామి వారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు