IIFA అవార్డ్స్‌-2024 షెడ్యూల్‌ ప్రకటన..

- August 23, 2024 , by Maagulf
IIFA అవార్డ్స్‌-2024 షెడ్యూల్‌ ప్రకటన..

అబుధాబి: ఈ ఏడాదిలో జరగనున్న 'ది ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడెమీ' (IIFA) పురస్కారాల వేడుకకు అబుధాబి వేదిక కానుంది. 24వ 'ఐఫా' వేడుకలు అబుధాబిలోని యాస్ ఐల్యాండ్‌లో సెప్టెంబర్ 27-29 వరకు జరగనున్నట్టు తాజాగా నిర్వాహకులు ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్‌తో పాటు నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా వెలువడింది.

ఐఫా అవార్డ్స్‌ వేడుకలో షాహిద్ కపూర్‌తో సహా బాలీవుడ్ ప్రముఖులు తమ ఆకర్షణీయమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డ్స్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. సెప్టెంబర్ 27న ఐఫా ఉత్సవం పేరుతో అద్భుతమైన ఈవెంట్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 28న అవార్డ్స్‌, 29న ఐఫా రాక్స్‌ గాలాతో ఈ కార్యక్రమం ముగుస్తోంది.

ఈ సంవత్సరం నామినేషన్లు ఇప్పటికే సంచలనం సృష్టించాయి. రణబీర్ కపూర్ 'యానిమల్' అత్యధికంగా 11 నామినేషన్లను దక్కించుకుంది. రణవీర్ సింగ్, అలియా భట్ నటించిన రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీ 10 నామినేషన్లను పొందింది. 2023 ఏడాదిలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌తో పాటు జవాన్ రెండూ పాపులర్ కేటగిరీలో ఏడు నామినేషన్‌లను పొందగా, విక్రాంత్ మాస్సే చిత్రం 12th ఫెయిల్ ఐదు నామినేషన్‌లను సాధించింది.ఈ సారి ఐఫా అవార్డ్స్‌ కోసం గట్టిపోటీ ఎదురుకానుంది.

ఐఫా అవార్డ్స్2024'కి హోస్ట్‌గా రానాతో పాటు యంగ్‌ హీరో తేజ సజ్జ వ్యవహరించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.ఈ మేరకు హైదరబాద్‌లో ముందస్తు వేడుక(కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌)లో కూడా వారు సందడి చేశారు. అయితే, ఇప్పుడు సడెన్‌గా షారూఖ్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌లు తెరపైకి వచ్చారు. అయితే, గతంలో కరణ్‌ ఐఫా హోస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉంది.ఈ ఈవెంట్ కి మాగల్ఫ్ న్యూస్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com