విశాఖపట్నంలో మెగా జాబ్ మేళా..
- August 23, 2024
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం క్రమం తప్పకుండా జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ వివిధ జాబ్ మేళాలు, మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
అప్డేట్లను అధికారిక AP ప్రభుత్వ ఉద్యోగ మేళా వెబ్సైట్లోhttp://employment.ap.gov.in లో చూడవచ్చు. విశాఖపట్నం, కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయాలు ఈ నెల 23న శుక్రవారం ఉదయం 10 గంటలకు 768 పోస్టులకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ విశాఖపట్నం జిల్లా అధికారి సి.హెచ్ సుబ్బిరెడ్డి తెలిపారు. ఆయా సంస్థల హెచ్ ఆర్ మేనేజర్లు స్వయంగా హాజరై అర్హులైన అభ్యర్ధులను వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
అమెజాన్ వేర్ హౌస్ తిరువళ్ళూర్ తమిళనాడు కంపెనీలో పికర్స్, పేకర్స్, స్టవ్వర్స్, సార్టర్స్, లోడింగ్, ఆన్ లోడింగ్ అసిస్టెంట్స్ మొత్తం 400 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు గాను 18 నుండి 30 సంవత్సరాలు వయసు ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేతనం రూ.18 వేల నుండి 20 వేల వరకు ఉంటుంది. ముత్తూట్ గ్రూప్ విశాఖపట్నం, ఇంటర్న్ ప్రొబేషనరీ ఆఫీసర్ 100 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 18 నుండి 26 ఏండ్ల వయస్సు ఉండాలి. డిగ్రీ, ఎంబీఏ ఎం.కాం చదివిన పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైనవారికి రూ.10 వేల నుంచి రూ.18,500 వరకు వేతనం ఉంటుంది.
ఫ్లూయేంట్ గ్రిడ్ లిమిటెడ్ విశాఖపట్నం కంపెనీ లో టెక్నీషియన్ పోస్టులు 100 ఉన్నాయి. విద్యార్హత ITI ఎలక్ట్రికల్/ డిప్లొమా. 18 నుండి 26 ఏండ్లు ఉండాలి. జీతం రూ.15 వేలు. ఆసక్తిగల యువతీయువకులు https://employment.ap.gov.in/, http://www.ncs.gov.inవెబ్ సైట్ నందు తమ పేర్లను నమోదు చేసుకుని తేది: 23.08.2024 న శుక్రవారం ఉదయం 10.00 గం. లకు జిల్లా ఉపాధి కార్యాలయము (క్లరికల్) నందు మెగా జాబ్ మేళాకు హాజరు కావాలి. అలాగే శ్రీ వైఎన్ డిగ్రీ కళాశాల, నర్సాపురం, పశ్చిమ గోదావరి ఆధ్వర్యంలో ఈ 23 శుక్రవారం నాడు జాబ్ మేళా జరుగనున్నది. ఫీల్డ్ అసిస్టెంట్/లోన్ ఆఫీసర్, సేల్స్ అధికారులు, మెషిన్ ఆపరేటర్ – అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, జూనియర్ కెమిస్ట్ /QC/QA, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మేనేజర్, రిలేషన్ షిప్ మేనేజర్లు, జూనియర్ డెవలపర్, బ్రాంచ్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, డీజిల్ మెకానిక్ వంటి పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







