కన్నడలో హిట్ మూవీ తెలుగు ఓటీటీలో.. ‘శాకాహారి’
- August 24, 2024
ఇటీవల ఆహా ఓటీటీలో వరుసగా మంచి మంచి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోని మంచి సినిమాలను డబ్బింగ్ చేసి ఆహాలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో కన్నడ సినిమాని ఆహా ఓటీటీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గోపాలకృష్ణ దేశ్ పాండే, వినయ్, నిధి హెగ్డే, హరిణి శ్రీకాంత్.. పలువురు ముఖ్య పాత్రలతో సందీప్ సుంకడ్ దర్శకత్వంలో కన్నడలో తెరకెక్కిన సినిమా శాకాహారి.
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా శాకాహారి సినిమా తెరకెక్కింది. ఈ కన్నడ సినిమాని హనుమాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బాలు చరణ్ తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో మెయిన్ పాత్రకు సీనియర్ నటుడు గోపరాజు రమణతో డబ్బింగ్ చెప్పించారు.
ఇక ఈ శాకాహారి సినిమా ఆహా ఓటీటీలో ఆగస్టు 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







