రంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సీఎంకు ఆహ్వానం
- August 24, 2024
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఈవో జే శ్యామలరావు చెప్పారు.
అన్నివిభాగాల అధికారులు, జిల్లాయంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని టీటీడీ ఈవో శ్యామలరావు టీటీడీ అధికారులను ఆదేశించారు.
టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మంలతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ అక్టోబరు 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో అక్టోబరు 4న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని శ్యామలరావు తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే సెల్ఫ్ గోల్, మీడియాతో పెట్టుకుంటావా ?, చంద్రబాబు వార్నింగ్ ?
తిరుమల బ్రహ్మోత్సవాల ముఖ్యాంశాలు:.
ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. గరుడవాహనసేవ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది.
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడం జరిగింది.
సుమారు ఏడు లక్షల లడ్డూల బఫర్ స్టాక్‌ను ఉంచుకోవడం జరుగుతుంది.
టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, జిల్లా పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
గరుడసేవకు ప్రత్యేకంగా అదనపు భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం కామన్ కమాండ్ సెంటర్ ద్వారా భద్రత పర్యవేక్షణ ఉంటుంది. వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా తిరుమల, తిరుపతిలలో పలు ఇంజినీరింగ్ పనులు చేస్తున్నారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు చేస్తున్నారు, వాహనసేవలు వీక్షించేందుకు మాడ వీధుల్లో గ్యాలరీలు, పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపులు ఉండవు. తిరుమలలో గదుల లభ్యత తక్కువగా ఉన్నందున, తిరుమలలో గదులు లభించని భక్తులు తిరుపతిలో బస చేయాలని టీటీడీ మనవి చేసింది. కల్యాణకట్ట, ఇతర మినీ కల్యాణకట్టలలో క్షురకులు నిరంతరాయంగా భక్తులకు సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి అదనపు సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లలో అన్నప్రసాదం, పాలు, అల్పాహారం వితరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలోని అశ్వని ఆసుపత్రి, వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని వైద్య కేంద్రాలు, డిస్పెన్సరీలతో పాటు పలు ప్రథమ చికిత్స కేంద్రాలు, మొబైల్ క్లినిక్, అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు వేల మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందించడానికి సిద్దం అయ్యారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వాహనసేవల ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు