అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానస్పద మృతి...!
- August 25, 2024
* అమెరికాలో డాక్టర్ అనుమానస్పద మృతి
* అమెరికాలో పలు ఆసుపత్రులు నిర్మించి సేవలు అందిస్తున్న రమేశ్ బాబు..
* టస్కలూసా ప్రాంతంలో మంచి వైద్యులుగా గుర్తింపు
అమెరికా: అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానస్పదంగా మృతి చెందారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరుకు చెందిన పేరంశెట్టి రమేష్ బాబును (68) కొంతమంది దుండగులు కాల్చి చంపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వివరాల ప్రకారం... తిరుపతి ఎస్వి వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన ఆయన జమైకాలో ఎంఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. ఆయనతోపాటు తన భార్య కూడా అక్కడే వైద్యురాలిగా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులతో వారు అమెరికాలోనే స్థిరపడ్డారు.
ఇదిలా ఉండగా.... కరోనా సమయంలో రమేష్ బాబు విశేష సేవలను అందించారు. తన సేవలకు గాను ఆయన ఎన్నో పురస్కారాలను సైతం అందుకున్నారు. గతంలో తాను చదువుకున్నటువంటి పాఠశాలకు రూ. 14 లక్షలు విరాళం అందించారు. అలాగే స్వగ్రామంలో సాయిబాబా ఆలయ నిర్మాణానికి సైతం రూ. 20 లక్షలు అందించారు. ఇటీవల ఏపీకి వచ్చిన ఆయన తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. ఇంతలోనే ఇలా జరగడంతో వారి కుటుంబసభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు