తిరుపతిలో కొత్త బస్టాండ్ ఏర్పాటు..
- August 25, 2024
తిరుపతి: తిరుపతిలో కొత్త బస్టాండ్ ఏర్పాటు కానుంది.. ఈ మేరకు బస్టాండ్ లో పర్యటించింది ఎన్ హెచ్ ఎల్ ఎం కమిటీ. కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రా తో కలిసి ఎంపి గురుమూర్తి పర్యటించారు.
బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను వివరించారు ఎంపి గురుమూర్తి. ఈ సందర్భంగా ఎంపి గురుమూర్తి మాట్లాడుతూ…బస్టాండ్ ను అధునాతనంగా రూపొందించనున్నారు.కొత్త బస్టాండ్ నిర్మాణానికి మాజీ సిఎం జగన్ కారకులు అన్నారు.
ఎన్ హెచ్ సీఈఓ ప్రకాష్ గౌర్ మాట్లాడుతూ…నూతన బస్టాండ్ డిజైన్స్ పై త్వరలో సిఎం చంద్రబాబు కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నామని.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో నూతన బస్టాండ్ ను పూర్తి చేస్తామని చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. ప్రయాణికులనే కాదు భక్తులను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ నిర్మాణం అన్నారు. భక్తులు సేదతీరేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని… ఫుడ్ కోర్టు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్ తదితర ఏర్పాట్లు నూతన టెర్మినల్ భవనంలో ఉంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







