అభిమాని కుటుంబాన్ని సత్కరించిన చిరంజీవి
- August 27, 2024
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తన అభిమాని ఈశ్వరయ్య కుటుంబాన్ని సత్కరించారు. ఈ నెల 22న చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఈశ్వరయ్య తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
దీంతో ఈశ్వరయ్య, ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని తన ఇంటికి ప్రత్యేకంగా చిరు పిలిపించుకున్నారు. ఆ కుటుంబ సభ్యులకు పట్టు బట్టలు పెట్టి సత్కరించారు. ఈశ్వరయ్య ఫ్యామిలీకి అండగా ఉంటానని చిరు చెప్పారు. కాగా, ఇవాళ చిరంజీవి అయ్యప్ప మాల ధరించారు. ఆయన ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరిస్తారన్న విషయం విదితమే.
చిరంజీవి మొదట నుంచి తన వీరాభిమానులకు అండగా నిలుస్తుంటారు. గతంలోనూ ఈశ్వరయ్య తిరుపతి నుంచి చిరంజీవి ఇంటి వరకు సైకిల్ యాత్రను నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజుతో పాటు ఆ పార్టీ ఎన్నికల్లో గెలవాలని కూడా అనేక సార్లు ఆయన పొర్లు దండాలు పెట్టారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు