కోల్‌కతా కేసు: లై డిటెక్టర్ పరీక్షలో షాకింగ్ విషయాలు
- August 27, 2024
కోల్‌కతా: భారత దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో సీబీఐ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి కోర్టు 14 రోజుల కస్టడీ విధించగా.. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలులో ఉంచారు. ఇక ఈ కేసులో నిందితులకు కోర్టు అనుమతితో సీబీఐ అధికారులు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. సంజయ్ రాయ్, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్లతోపాటు ఘటన జరిగిన రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు డాక్టర్లు, ఇంకో సివిల్ వాలంటీర్లకు.. ఢిల్లీ నుంచి రప్పించిన సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల బృందం శని, ఆదివారాల్లో ఈ లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించింది. అయితే ఈ లై డిటెక్టర్ నివేదికను సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచారు.
ఈ పాలిగ్రాఫ్ టెస్ట్‌లో నిందితుడు ఏం చెప్పాడు అనే దానిపై సంబంధిత అధికారులను ఉటంకిస్తూ.. వార్తలు వెలువడుతున్నాయి. లై డిటెక్టర్ టెస్ట్‌లో నిందితుడు సంజయ్ రాయ్ అన్నీ తప్పుడు సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఒకదానికి మరొకటి పొంతన లేని సమాధానాలు చెప్పాడనని తెలుస్తోంది. తాను ఆస్పత్రి సెమినార్ హాల్లోకి వెళ్లేసరికే ఆ డాక్టర్ చనిపోయి కనిపించిందని సంజయ్ రాయ్ చెప్పినట్లు సమాచారం. ఇక ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో సంజయ్ రాయ్ అనాలోచితంగా, ఆత్రుతగా ఉన్నట్లు కనిపించిందని సంబంధిత అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు, నమ్మశక్యం కాని సమాధానాలను చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక సీబీఐ అధికారులు నిందితుడికి ఆధారాలు చూపించినప్పుడు.. ఆ సమయంలో తాను అక్కడ లేనని సంజయ్ రాయ్ చెప్పడం మరింత చర్చనీయాంశంగా మారింది. తాను వెళ్లేసరికి ఆ డాక్టర్ అప్పటికే చనిపోయి ఉండటంతో.. తనకు భయం వేసిందని.. వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్లు సంజయ్ రాయ్ చెప్పినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్‌కి పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించే సమయంలో అతడి తరఫు డిఫెన్స్ లాయర్ లేకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై నిందితుడి లాయర్ స్పందించారు. ఈ పాలిగ్రాఫ్ పరీక్ష ఎక్కడ నిర్వహిస్తామన్నది అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు