మంత్రరాశుల వెనుక 'శ్రీనివాస్' కి దైవబలం పుష్కలం: కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి

- August 27, 2024 , by Maagulf
మంత్రరాశుల వెనుక \'శ్రీనివాస్\' కి  దైవబలం పుష్కలం: కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి

హైదరాబాద్: అఖండ కాల స్వరూపాలైన  మంత్రరాశుల్ని ఒక మహాసాధనగా అపురూప అఖండ గ్రంథాలుగా అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దైవీయ చైతన్య లక్ష్యం వెనుక ఉన్న అసాధారణ నిస్వార్ధ సేవ , అందమైన భాష, భక్తి తన్మయత్వం మామూలు విషయాలు కావని  భారతదేశ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కె.గీతామూర్తి  సమర్పణలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా వినూత్న రీతిలో రూపుదిద్దుకున్న ' శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్ '  సుమారు మూడువందల యాభైపేజీల దివ్య గ్రంధాన్ని ఆయన గురువారం రాత్రి  ఆవిష్కరించి తొలిప్రతిని కేంద్ర హోమ్ శాఖామంత్రి బండి సంజయ్ కి అందించారు.

ఈ సందర్భంగా కేంద్ర హోమ్ శాఖామంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ బలమైన సంకల్పాలతో పవిత్ర మార్గంలో ప్రయాణిస్తున్న పురాణపండ శ్రీనివాస్ అచ్చమైన భక్తి తత్వానికి దైవబలం మహాబలంగా మహా మంగళ కార్యాలు చేయిస్తుందని చెప్పారు.

ఈ సందర్భంగా భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కె.గీతామూర్తి  మాట్లాడుతూ శ్రావణ పుణ్య మాసంలో ఈ పవిత్ర శ్రీ కార్యాన్ని తాను భుజాలకెత్తుకోవడానికి తన తల్లితండ్రుల పుణ్యం, చిన్న నాటి నుండీ సంస్కారప్రదమైన వాతావరణంలో జీవనం సాగుదామని పేర్కొంటూ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని స్పష్టం చేశారు.

అనంతరం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సైత పాల్గొన్న అనేక మంది మహిళా శ్రేణులకు ఈ  ' శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్' గ్రంధాన్ని గీతామూర్తి స్వయం పంచడం విశేషంగా ఆకర్షించింది.

సుమారు రెండు నెలలుగా  తొమ్మిది పుణ్య క్షేత్రాలలో, ఏడు సాంస్కృతిక సభలలో,రెండు కళాశాలల్లో సుమారు ఇరవై ప్రచురణకు నోచుకున్న ఈ మంగళ గ్రంధం త్వరలో ఇరవై ఐదవ ప్రచురణకు సన్నాహమవుతుండటం ఈ రోజుల్లో కేవలం దైవానుగ్రహమేనని
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు నల్లంధీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు మంగళాశాసనమ్ చెయ్యడం దైవబలంగానే పేర్కొనక తప్పదు. .

ఇదిలా ఉండగా... గత వారం రోజుల నుండీ గీతామూర్తి జంట నగరాల్లో ఏ ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొన్నా ఈ చక్కని బుక్స్ ని తానే స్వయంగా నాయకురాళ్లకు, కార్యకర్తలకు పవిత్రంగా అందించడం విశేషం.మరొక వైపు తూర్పు గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు లకు  ప్రముఖ ధార్మిక గ్రంధాల  ప్రచురణ సంస్థ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ అధినేత గొల్లపూడి నాగేంద్ర కుమార్ ఈ  'శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్' గ్రంధాన్ని బహూకరించారించడమే కాకుండా... రాజమహేంద్రవరం నగరంలోని అనేక ఆలయాలకు సైతం నాగేంద్రకుమార్ దంపతులు వీటిని ఉచితంగా పంచడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

తిరుమల మహాక్షేత్రం ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు నుండీ....యాదాద్రి వరకూ శ్రీనివాస్ నిస్వార్ధ సేవకు, రచనా సౌందర్యానికి పండిత వర్గాలనుండి అనుగ్రహం వర్షిస్తూనే ఉండటం గమనార్హం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com